మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణకు గైర్హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోసం సీబీఐ బృందాలు కర్నూలుకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీబీఐ ప్లాన్ బీ అమలులో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ నుంచి కేంద్ర బలగాలు కర్నూలుకు చేరుకుంటున్నాయి. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాలని వరుసగా మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. దీంతో తన తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం బాగా లేదంటూ అవినాష్ రెడ్డి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలోనే మకాం వేయడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలోని దుకాణాలు తెరవకుండా పోలీసులు మూసివేయిస్తుండడం గమనార్హం. కర్నూలు పరిస్థితులపై సీబీఐ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కర్నూలులో జరుగుతున్న పరిణామాలపై సీబీఐ అధికారులు ఢిల్లీ ఆఫీసుకు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు విశ్వభారతి ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణులు బైఠాయించడంతో ఆస్పత్రి ఆవరణంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు.
ఒకవైపు సీబీఐ బృందం కర్నూలుకు రావడంతో హైడ్రామా కొనసాగుతుందగా, మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ నుంచి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న సమాచారంతో ఉత్కంఠత నెలకొంది.
Kurnool: అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES