Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collector: భూ హక్కు పత్రాల పంపిణీ సోమవారం నాటికి పూర్తి చేయాలి

Kurnool Collector: భూ హక్కు పత్రాల పంపిణీ సోమవారం నాటికి పూర్తి చేయాలి

ఆప్షన్ 3 కింద నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాల పై ప్రత్యేక శ్రద్ధ వహించండి

పెండింగ్ లో ఉన్న భూ హక్కు పత్రాల పంపిణీ సోమవారం నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని టెలి కాన్ఫరెన్స్ లో మండలాల తహసిల్దార్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన హెచ్చరించారు. మండల స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపీడీఓ లు, తదితరులతో రీ సర్వే, హౌసింగ్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న భూ హక్కు పత్రాల పంపిణీ సోమవారం నాటికి పూర్తి చేయాలని ముఖ్యంగా ఓర్వకల్లు, కర్నూలు రూరల్, గూడూరు, పెద్దకడుబూరు, కోడుమూరు, సి.బెలగల్ మండలాలలోని గ్రామాల్లో ఎక్కువగా పెండింగ్ ఉన్నాయని వాటిని సోమవారం నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల తహసిల్దార్లను ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్ కి సంబంధించి అన్ని మండలాలకు లక్ష్యాలను కేటాయించడం జరిగిందని, మంత్రాలయం మండలానికి గ్రౌండ్ ట్రూతింగ్ 700 ఎకరాలు చేయాలని లక్ష్యాన్ని కేటాయించగా కేవలం 20 ఎకరాలు చేయడం ఏంటని కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ మంత్రాలయం తహసిల్దార్, సర్వేయర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌసింగ్ కి సంబంధించి రేపు హౌసింగ్ డే ఉంది కాబట్టి బిలో బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి బేస్మెంట్ లెవెల్ స్థాయికి, బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి కంప్లీషన్ స్థాయికి సంబంధించిన పనులలో ఆప్షన్ 3 కింద నిర్మిస్తున్న కాంట్రాక్టర్ లతో ఎంపిడిఓ, హౌసింగ్ ఏఈ లు సమావేశం నిర్వహించుకోవాలని అందుకు సంబంధించిన సమావేశపు మినిట్స్ పంపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అదేశించారు. అదే విధంగా ఎంపిడిఓ, హౌసింగ్ ఏఈ ప్రతి రోజు కాంట్రాక్టర్ లతో మాట్లాడి పనులలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి కంప్లీషన్ స్థాయికి కన్వర్షన్ చేసే పనుల పూర్తి బాధ్యత హౌసింగ్ ఏఈ ల మీద ఉందని చెప్పినప్పటికీ కూడా జీరో పురోగతి సాధించడం ఏంటని హోళగుంద, కర్నూలు, కోడుమూరు, ఆదోని అర్బన్ మండలాల హౌసింగ్ ఎఈ లను ప్రశ్నించారు? పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా పూర్తి కావాల్సిన ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి కౌతాళం మండలం ఇంకా 96 శాతం ఎందుకు ఉందని సోమవారం నాటికి 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా సిమెంట్, ఇసుక కొరత, లేబర్ సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్థాయిలో బుధవారం, శనివారం నిర్వహించే కో ఆర్డినేషన్ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ రేపు సాయంత్రం నాటికి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కి పంపించాలని సంబంధిత మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ.. స్టోన్ ప్లాంటేషన్ 10 గ్రామాల్లో పూర్తయిందని, పెండింగ్ ఉన్న గ్రామాల్లో రేపు సాయంత్రం నాటికి పూర్తి చేయాలని ముఖ్యంగా ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో, కోడుమూరు మండలం, వెల్దుర్తి మండలంలోని బుక్కాపురం గ్రామంలో ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని సంబంధిత మండల తహశీల్దార్లు ఒక ప్రణాళిక రూపొందించుకొని రేపు సాయంత్రం నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే కి సంబంధించి విలేజ్ సర్వేయర్, విఆర్ఓ లాగిన్ లలో పెండింగ్ లో ఉన్న డేటా వివరాలను ఎంట్రీ చేయడంలో ఆలూరు మండలంలోని కరదిగుడ్డం, కల్లూరు మండలంలోని సల్కాపురం, గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామాలు నిర్దేశించిన గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల తహసిల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో డిఆర్ఓ మధుసూదన రావు, సిపిఓ అప్పలకొండ, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్, ఇంఛార్జి హౌసింగ్ పిడి సిద్ధలింగ మూర్తి, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News