Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collector: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Kurnool Collector: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అర్హులంతా అప్లై చేసుకోండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D 2023 పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో పని చేసేందుకు స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. పోస్టుల వివరాలు, వయసు, విద్యార్హతలు, ఫీజు వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలను https://ssc.nic.in/SSCFileServer/Portal Management/UploadedFiles/Final_Not ice-Steno-2023_02082023.pdf ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దరఖాస్తులు తప్పనిసరిగా ఆన్లైన్ లోssc.nic.in ద్వారా మాత్రమే చేసుకోవాలన్నారు. దరఖాస్తులు ఈ నెల 23 లోపు సమర్పించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News