Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: జూలైలో రికార్డు స్థాయిలో వర్షం, రైతన్నల ఆనందం

Kurnool: జూలైలో రికార్డు స్థాయిలో వర్షం, రైతన్నల ఆనందం

సాధారణ వర్షపాతం 2357.9 మి మీ, నమోదైన వర్షపాతం 3860.6 మి మీ

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత మాసంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గత నెలలో జూలై 1 నుండి 31 వరకు సాధారణ వర్షపాతం 2357.9 మి మీ ఉండగా గరిష్టంగా 3860.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో గత మాసంలో కురిసిన వర్షపాతంలో గూడూరు మండలంలో గరిష్ట వర్షపాతం, హాలహర్వి మండలంలో కనిష్ట వర్షపాతం నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని 174.4, మంత్రాలయం 188.8 కోడుమూరు 159, హాలహర్వి 84.6, పెద్దకడుబూరు 157, తుగ్గలి 109.8, కౌతాళం 163.8, గూడూరు 229.2, ఎమ్మిగనూరు 212, పత్తికొండ 145.6, ఆలూరు 69.4, గోనెగండ్ల 143.4, కోసిగి 197, హోలగుంద 70, ఓర్వకల్లు 128.4, క్రిష్ణగిరి 99.8, కల్లూరు 197.2, కర్నూలు రూరల్ 201.6, సి బెలగల్ 221.6, నందవరం 150.6, కర్నూలు అర్బన్ 228.6, ఆస్పరి 78.4, వెల్దుర్తి 159.6, మద్దికెర 96.4, దేవనకొండ 103.6, చిప్పగిరి 94.4మి మీ వర్షపాతం నమోదయ్యింది. జూలై నెలలో సాధారణ వర్షపాతం కంటే రికార్డు స్థాయిలో 64శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో 90.7% సాధారణ వర్షపాతం ఉండగా 148.5% వర్షపాతం నమోదు అయ్యింది. జూలై నెల చివరి వరకు చాలామంది రైతులు ఖరీఫ్ సీజన్లో పంటలను సాగు చేయలేదు ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News