కలెక్టరేట్ కార్యాలయ భవన మరమ్మతులో భాగంగా ఆధునికరించిన ఎలక్షన్ సెల్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రారంభించారు. కలెక్టరేట్ సముదాయంలో ఆధునీకరించిన ఎలక్షన్ సెల్ కార్యాలయంను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయ భవన మరమ్మతులో భాగంగా తొలుత ఎలక్షన్ సెల్ కార్యాలయాన్ని ఆధునికరించి ప్రారంభించామన్నారు.
నూతనంగా నిర్మించిన కార్యాలయ గదులను పరిశీలిస్తూ చాలా చక్కగా ఆధునీకరించారని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, సిపిఓ అప్పలకొండ, ఎన్నికల సూపరిoటెండెంట్ మురళి, ఎన్నికల సెల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.