Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి

Kurnool: ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

జిల్లాలో పంటలు వేసిన ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ అంశాలపై జిల్లాలోని డివిజన్ స్థాయి, మండల స్థాయి, మరియు తహశిల్దార్లతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో పంటలు వేసిన ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ క్రాప్ బుకింగ్ చేసిన తర్వాత విఆర్ఓల లాగిన్ కి రాగానే వెంటనే ఈ కెవైసి చేయాలని కాని విఆర్ఓ లు చాలా తక్కువ పురోగతి సాధిస్తున్నారని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1700 మంది కౌలు రైతులను గుర్తించామన్నారు. అందులో 327 మంది రైతులకు రుణాలు కూడా ఇప్పించామన్నారు.

మిగిలిన వారికి కూడా బ్యాంకర్స్ తో మాట్లాడి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వే కి సంబంధించి పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ పనులు నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రౌండ్ ట్రూతింగ్ కు సంబంధించి ఆదోని రెవెన్యూ డివిజన్లో 20 శాతం మాత్రమే పెండింగ్ ఉందని, కర్నూల్ డివిజన్ లోని కల్లూరు బొల్లవరం మునగాల లో పూర్తిచేసి ఎల్ పి ఎం జనరేట్ చేయాలన్నారు. పత్తికొండ డివిజన్లో పెండింగ్ ఉన్న గ్రామాలన్నీ నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని డివిజనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అసైన్మెంట్ భూములకు సంబంధించి వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇనాము భూములకు సంబంధించి ఆదోని, కర్నూల్, పత్తికొండ డివిజన్లోని ఈనాము భూముల వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాత అసైన్మెంట్ భూముల గురించి, ఆబాది సర్వే, రీ సర్వే ఫేస్ 3, పిఎం కిసాన్ భూమి లింకేజ్ తదితర అంశాలపై మండల స్థాయి, అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు, జిల్లాలోని తహసిల్దార్లు, మండల స్థాయి వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News