Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధం

Kurnool: నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధం

నిమజ్జనోత్సవాల దృష్ట్యా మెడికల్ క్యాంపులు..

కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక నిమర్జన మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు అలాగే ముఖ్య ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు, 108 అంబులెన్స్ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.సృజన పేర్కొన్నారు. వినాయక నిమర్జన ఉత్సవాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినాయక ఘాట్ వద్ద మూడు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పూలబజార్, పెద్ద మార్కెట్ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ్ మండపం, రాజ్ విహార్ సర్కిల్, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్ కల్లూరు, ఆర్ ఎస్ రోడ్, ఫైవ్ రోడ్ సర్కిల్, బిర్లా గేట్, కలెక్టరేట్ వద్ద కూడా మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు. పెద్ద మార్కెట్ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపం, ఓల్డ్ కంట్రోల్ రూమ్, రాజ్ విహార్ సర్కిల్, సి క్యాంప్ సర్కిల్, బళ్లారి చౌరస్త, ఆర్.ఎస్ రోడ్, ఫైవ్ రోడ్ సర్కిల్ , గాయత్రి ఎస్టేట్, వినాయక ఘాట్ వద్ద 108 అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

వినాయక ఘాట్, రాజ్ విహార్ సెంటర్, ఓల్డ్ బస్టాండ్ మార్కెట్, స్టాంటన్ పురం వద్ద వద్ద అగ్నిమాపక వాహనాలతో పాటు సంబంధిత పరికరాలను, రెస్క్యూ టీం ను కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. అవసరమైన పరిస్థితుల్లో ఈ సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వినాయక ఘాటు వద్దకు చేరుకుని నిమర్జనానికి కావలసిన ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్ భార్గవ తేజ, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఎస్.ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్.ఈ నాగరాజు, వి హెచ్ పి నాయకులు, కర్నూలు నగర వినాయక మహోత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News