Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఓటర్ లిస్టులో తప్పులు జరిగితే చర్యలు తప్పవు

Kurnool: ఓటర్ లిస్టులో తప్పులు జరిగితే చర్యలు తప్పవు

డిసెంబర్ 9 వ తేదీ లోపు వచ్చిన ప్రతి క్లైమ్, అబ్జెక్షన్స్ పరిష్కరిస్తాం

ఓటర్ల జాబితా సవరణలో కచ్చితంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని ఓటర్ల జాబితా పరిశీలకులు, ఏపీఎంఎస్ఐడిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. మురళీధర రెడ్డి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓ లను ఆదేశించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 పై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ప్రజా ప్రతినిధులు, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ బిటి నాయుడు, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ,ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ మధుసూదనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ఏడాది అయినందున ఓటర్ల జాబితా తయారీలో అధికారులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.

- Advertisement -

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లకు కేవలం ఓటు హక్కు మాత్రమే కలిగించడం కాకుండా ఓటర్ కు సంబంధించిన ఫోటోగ్రాఫ్, అడ్రస్ తదితర వివరాలన్నీ పొరపాటు లేకుండా ఉండాలన్నారు. ఫార్మ్స్ డిస్పోస్ చేయడంలో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు వచ్చిన ఫార్మ్స్ డిస్పోస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల నమోదులో కర్నూలు జిల్లా రాష్ట్ర యావరేజ్ కంటే తక్కువగా ఉందని, ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల నమోదులో పురోగతి తీసుకొని రావాలన్నారు. ఎన్నికలకు సంబంధించి పత్రికలలో ప్రతికూల వార్తలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా వెరిఫై చేసి, విచారణ చేసి తగినచర్యలు తీసుకోవాలన్నారు. ఆమేరకు తగిన డాక్యుమెంటేషన్ ఉండాలని బిఎల్వోలు రిమార్క్ కాలం లో క్లుప్తంగా, స్పష్టత లేకుండా రాస్తున్నారని, అలా కాకుండా తీసుకున్న నిర్ణయాన్ని సవివరంగా స్పష్టతతో రాయాలని సూచించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన పూర్తిస్థాయిలో విచారణ చేయాలన్నారు. బి ఎల్ వోలు కచ్చితంగా ఇంటింటికి వెళ్లాలన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏమైనా సందేహాలు వస్తే సూచనలు తీసుకోవాలని, అంతే గాని స్వంత నిర్ణయాలు తీసుకోరాదని తెలిపారు.

డిసెంబర్ 9వ తేది తర్వాత దరఖాస్తుల పరిష్కారాన్ని రాండంగా తనిఖీ చేస్తానన్నారు. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉందో పరిశీలిస్తానని, ఎన్నికల కమిషన్ ప్రొసీజర్ను పాటించారా లేదా అని చూస్తానని తెలిపారు. రాజకీయ పార్టీలు సూచించిన అంశాలపై జిల్లా కలెక్టర్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు. జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అనానిమస్, జంక్ ఓటర్లు మీద ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పరిష్కరించిన ప్రతి దరఖాస్తు కు పక్కాగా డాక్యుమెంటేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని 18, 19 ఏళ్ల వయసు ఉన్న ఓటర్లను నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

డిసెంబర్ 9 వ తేదీ లోపు అన్ని క్లైములు, అబ్జెక్షన్లను పరిష్కరిస్తామని వివరించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ బిఎల్వోలు 30% మాత్రమే ఇంటింటికి వెళ్తున్నారని, మిగిలిన వారు సచివాలయం నుండే చేస్తున్నారని తెలిపారు.. ఫార్మ్స్ డిస్పోజల్ లో అధికారులు చెప్తున్న సంఖ్యకు, తమ వద్ద ఉన్న సమాచారానికి మధ్య చాలా తేడా ఉందని ఓటర్ల జాబితా పరిశీలకులు దృష్టికి తెచ్చారు. ఈ అంశాలపై ఓటర్ల జాబితా పరిశీలకులు స్పందిస్తూ పరిశీలిస్తామని, బిఎల్వోలు ఇంటింటికీ వెళ్లేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే డా.జే.సుధాకర్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని, 18,19 ఏళ్ల ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, డిసెంబర్ 2 3 తేదీల్లో జరిగే స్పెషల్ క్యాంపెయిన్కు ప్రజలకు తెలిసేలా పబ్లిసిటీ ఇవ్వాలని, డెత్ ఓటర్ల ను తొలగించాలని, కర్నూల్ టౌన్ లో పాత డోర్ నంబర్లు కొత్త డోర్ నంబర్లు వెరిఫై చేయాలనీ, ఒకే ఇంట్లో ఎక్కువ ఓటర్లు ఉన్న వాటిని వెరిఫై చేయాలని ఓటర్ల జాబితా పరిశీలకులు దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి జాన్ విల్సన్, సిపిఐ పార్టీ నుండి దేశాయ్, భారతీయ జనతా పార్టీ నుండి సాయి ప్రదీప్, బహుజన్ సమాజ్ పార్టీ నుండి అరుణ్ కుమార్, శశికర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గోపాల్, రవి, ఐజాజ్ అలీ ఖాన్, తెలుగుదేశం పార్టీ నుండి మధుబాబు నాయుడు, శ్రీనివాసులు, సత్రంరామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News