Wednesday, October 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: త్రిపుల్ ఐటీ డిఎంలో 5వ స్నాతకోత్సవం

Kurnool: త్రిపుల్ ఐటీ డిఎంలో 5వ స్నాతకోత్సవం

వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్ మెడల్

కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐ ఐ ఐ టి డి ఎం) కళాశాల ఐదవ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రస్తుత ఐఐటీ హైదరాబాద్, రూర్కి చైర్మన్, సైయింట్ సంస్థ వ్యవస్థాపకులు, ఇంజనీరింగ్ రంగ నిపుణులైన డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ సమాచార రూపకల్పన తయారీ సంస్థ చైర్మన్ ఆచార్య ఏహెచ్ రంగనాథ్ హాజరయ్యారు.

- Advertisement -

ఐదో స్నాతకోత్సవంలో 2019-23 బ్యాచ్ కి చెందిన 117 మంది బిటెక్ విద్యార్థులకి పట్టాలు అందజేశారు. అలాగే బ్రాంచ్ ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పథకాలు అందించారు. ఈ సందర్భంగా బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ అభివృద్ధికి నూతన ఇండస్ట్రీ 4.0 ఎదుగుదలకి భావితరాలే మైలురాయని విద్యార్థులను ప్రోత్సహించారు. ఐఐటిడిఎంని స్థాపించిన 9 సంవత్సరాల సమయంలోనే ఎంతగానో అభివృద్ధి చెందింది అని, సమాచార సాంకేతిక రంగాలలోనే కాకుండా డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ అందరికంటే ముందడుగు వేయడం గర్వపడే విషయమన్నారు.

భవిష్యత్తులో ఉన్న సవాళ్లు, అవకాశాలను స్వీకరించాలని సాంకేతికంగా అభివృద్ధి చెందిన సృజనాత్మకంగా సుసంపన్నమైన భవిష్యత్తును రూపొందించుకోవచ్చునని ముగింపు కోసం, వేగవంతమైన సాంకేతిక పురోగతులు మారుతున్న పోకడలు, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతపై మా దృక్పథంలో ప్రాథమిక మార్పుల ఈ అపూర్వమైన యుగంలో “మీ సామర్థ్యాన్ని వెలికితీయండి – ఇన్నోవేషన్‌ను వెలిగించండి, ఇంపాక్ట్‌ను పెంచండి, పరివర్తనను ప్రేరేపించండి సంకల్పం ఊపందుకుంటున్నదని” సందేశాన్ని గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ డి వి ఎల్ ఎన్ సోమయాజులు 2022-2023 విద్యా సంవత్సరానికి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇన్స్టిట్యూట్ యొక్కప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. ఐఐఐటి డియం కర్నూల్లోని కోర్సులు మరియు పాఠ్యాంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్, డిజైన్-మాన్యుఫ్యాక్చరింగ్ మొదలైన ఇంజనీరింగ్ సైన్స్ లో సంబంధిత పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తాయన్నారు.

అనంతరం ఇన్స్టిట్యూట్ యొక్క వివిధ కోర్సులలో ఈ సంవత్సరం ఉత్తీర్ణులైన 117 మంది బి. టెక్, ఒక ఎం. టెక్. విద్యార్థులకు ఈ స్నాతకోత్సవం లో డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి.బి. టెక్ సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లలో టాపర్స్‌గా నిలిచిన కె సాయి దీపిక లహరి, ఎస్ ప్రవల్లిక, హర్ష తేజ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసారు. అన్నీ విభాగాలలో ఓవరాల్టాపర్ గా నిలిచిన విద్యార్థిని కె సాయి దీపిక లహరి మూడు బంగారు పథకాలు సాధించారు. CSE డిపార్ట్‌మెంట్‌లో అతుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇచ్చే దుర్వాసుల మాణిక్యాంబ స్మారక బంగారు పథకాన్ని కూడా విద్యార్థిని కె సాయి దీపిక లహరి అందుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News