నీతి నిజాయితీకి మారుపేరు స్వర్గీయ కోట్ల విజయభాస్కర రెడ్డని జిల్లా అధ్యక్షులు బీటి నాయుడు అన్నారు. విజయభాస్కర్ రెడ్డి జయంతి వేడుకల్లో భాగంగా కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, కోడుమూరు టిడిపి ఇన్చార్జి ప్రభాకర్, లక్కీ టు బ్రదర్స్, కే ఎస్ కే హాస్పిటల్ ఎండి లాల్ బహుదూర్ శాస్త్రి, డాక్టర్ కుసుమ ఆయన సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి 103 వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా కేఎస్ కేర్ హాస్పిటల్ నందు లాల్ బహుదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కేక్ కట్ చేసి తర్వాత రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కె ఎస్ కే ర్ హాస్పిటల్ ఎండి లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా పేద ప్రజలకు 8,000 రూపాయలకు ఆపరేషన్ చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. హాస్పిటల్లో మూడు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని, హాస్పిటల్లో రోగులకు 50% రాయితీ ఇస్తామని ఆయన ప్రజలకు తెలియజేశారు. సాధారణంగా ఆపరేషన్ ఖర్చు 20 నుంచి 50 వేలు అవుతుందని, పేద ప్రజలు అంత డబ్బు పెట్టలేరు కనుక హాస్పిటల్ నుంచి ఎనిమిది వేల రూపాయలకే ఆపరేషన్లు చేస్తామని డాక్టర్ కుసుమ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల వరకు పేద ప్రజలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అత్యంత సాధారణ జీవితం గడిపేవారని, తన పదవిని అడ్డుపెట్టుకుని ఏమి ఆస్తులు సంపాదించలేదని, కోట్ల జీవితాన్ని గుర్తు చేస్తూ.. పేద ప్రజలకు వైద్యం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ బాషా, సత్యం రెడ్డి, అసదుల్లా ఖాన్, కిరణ్, సింహాద్రి, వెంకటేష్
తదితరులు పాల్గొన్నారు.