Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కేవీఅర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కు షోకాజ్

Kurnool: కేవీఅర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కు షోకాజ్

కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పాటు ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు, కలెక్టర్ పట్ల దురుసు ప్రవర్తనపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా కేవీఆర్ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించాలని సివిల్ ఫోరం అధ్యక్షులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కే. చెన్నయ్య హైకోర్టులో పిల్ (285/2015) వేశారు. దీంతో కోర్టు కూడా పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఇదే విషయం చెన్నయ్య ఇటీవల స్పందన లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించాలని ఆదేశాలున్నా, ప్రిన్సిపాల్ అమలు చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతిని వివరణ కోరింది. అయితే స్పందనలో వచ్చిన పిటిషన్ లు పరిశీలనలో ఉన్నాయని, తమ పనికి అంతరాయం కలిగించ వద్దని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వీటన్నిటిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ సివిల్ సర్వీసెస్(ప్రవర్తన) రూల్స్, 1964 రూల్ 3- బీ(ఏ) ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు, ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీఆర్ జూనియర్ కళాశాలకు 2.00 ఎకరాల భూమిని, ప్రభుత్వ కళాశాల ఆవరణ నుండి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని నోటీస్ లో ప్రశ్నించింది. జూనియర్ కళాశాల, కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులను అడ్డుకోవడం, గౌరవనీయమైన కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడం ఒక సివిల్ సర్వెంట్ గా ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించింది. రూల్ 3 ప్రకారం తన విధులను నిర్వర్తించడంలో ప్రిన్సిపాల్ విఫలం కావడంతో ఏపీ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) రూల్స్, 1964 యొక్క రూల్ 3-బీ(ఏ) ప్రకారం, ఏపీసీసీఏ ప్రకారం మీపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసు అందిన మూడు రోజుల లోపు మీ వివరణ ఇవ్వాలని కేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతిని కలెక్టర్ గుమ్మళ్ళ సృజన ఆదేశించింది. ఇదే విషయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఉన్నత విద్యా శాఖ అధికారులకు కూడా నివేదించినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ప్రిన్సిపాల్ ఎలా స్సందించి, ఏమని సమాధానం ఇస్తారాన్నది జిల్లాలో ఆసక్తిరేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News