Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఉచిత న్యాయ సేవను సద్వినియోగం చేసుకోండి

Kurnool: ఉచిత న్యాయ సేవను సద్వినియోగం చేసుకోండి

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కు సంబందించిన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ ఎస్. మనోహర పంచలింగాల గ్రామంలోని జిల్లా జైలును, మహిళా జైలును సందర్శించారు. అక్కడ ఉన్న ఖైదీల వివరాలను సంబందిత జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందించే భోజన సదుపాయాలను స్వయంగా పరిశీలించి, పర్యవేక్షణ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. ఖైధీలకు బెయిల్ మంజూరు అయి విడుదల కాకుండా ఉన్నవారిని గురించి తెలుసుకొని వారికి కావలసిని న్యాయ సహాయం అందిస్తామన్నారు. 65 సంవత్సరాలు పైబడిన ఖైదీల వివరాలు సేకరించారు ఎందుకంటే వారి విడుదలకోసం. ఖైదీలతో మాట్లాడటానికి వచ్చే వారికి మాట్లాడే సదుపాయాన్ని పరిశీలించారు. ఉన్నత న్యాయ సేవ అధికార సంస్థ ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ సిస్టమ్ ద్వారా అందిస్తున్న మెరుగైన ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, జైలు పర్యవేక్షణ అధికారులు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News