Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool-Nandyala: చార్జీలను తగ్గించకపోతే మరో బషీర్ బాగ్ ఉద్యమం

Kurnool-Nandyala: చార్జీలను తగ్గించకపోతే మరో బషీర్ బాగ్ ఉద్యమం

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు.

- Advertisement -

ధర్నా కార్యక్రమానికి అధ్యక్షునిగా సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి రాముడు అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వామపక్ష పార్టీ నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి.గిడ్డయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల, జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మల్లికార్జున, ఎస్ యు సి ఐ జిల్లా నాయకులు నాగన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల కాలం ప్రజలపై ఎటువంటి భారాలు మోపనని ప్రజలకు హామీ ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీలు, సర్ చార్జీలు, ఇంధనం సర్దుబాటు చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలు, విద్యుత్ సుంకం లాంటి వివిధ రకాల పేర్లతో ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి పెద్ద ఎత్తున ప్రజలపై బారాలు మోపిందని దీని కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడింది.

స్మార్ట్ మీటర్ల పేరుతో వ్యవసాయ రంగానికి, రైతులకు ఇచ్చేస్తున్నటువంటి ఉచిత విద్యుత్తును యధావిధిగా కొనసాగించాలని మీటర్లు బిగించాలని ఉపసంహరించుకోవాలని పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని ట్రూ ఆఫ్ చార్జీలు ఇతర ధారాలను రద్దు చేయాలని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీలకు వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ల వరకు ఉచిత రాయితీ ఇవ్వాలని అలాగే 200 యూనిట్లు లోపు వాడే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలని విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి యస్.రాధాకృష్ణ, కెవి.నారాయణ, సియచ్.సాయిబాబా, కె.సుదాకరప్ప, అర్.నరసిహులు, యం.విజయ్, అబ్దుల్ దేశాయ్, షరీఫ్, రామక్రిష్ణ, కె.ప్రభాకర్, మహ్మద్ రఫీ, నోమేశ్వరీ, బాస్కర్, శంకర్, మైముద్, సిపిఐ ఎంఎల్ పార్టీల నాయకులు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కే జగన్నాథం, సిపిఐ నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, మహేష్ నగర కార్యవర్గ సభ్యులు బీసన్న, నాగరాజు, గిడ్డమ్మ, అమ్మినాభి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News