Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ప్రకృతి వ్యవసాయాన్ని పెంచండి

Kurnool: ప్రకృతి వ్యవసాయాన్ని పెంచండి

కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెంచేందుకు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు..సమావేశంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో, ఏ ప్రాంతంలో, ఎంత మంది రైతులను ఈ ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి అని లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించాలని కలెక్టర్ ఆదేశించారు..లక్ష్యాలు నిర్దేశించుకోకపోతే ఫలితాలు సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు..మార్కెట్ ఉంది, 10 రూపాయలు ఎక్కువైనా తీసుకునే వారున్నారు, అందువల్ల జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెంచండి అని కలెక్టర్ సూచించారు.ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నవారికి అదనపు సబ్సిడీతో కలిగే ప్రయోజనాలను కరపత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.. అంగన్వాడీ సెంటర్లు, సంక్షేమ శాఖల వసతి గృహాలు, పాఠశాలల్లో ఖాళీ ప్రదేశాల్లో ప్రకృతి వ్యవసాయం విధానంలో కూరగాయలు, ఆకు కూరలు పండించేన్దుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విద్యా శాఖ, సంక్షేమ శాఖలు, ఐసీడీఎస్, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..చిరుధాన్యాల సాగు పెంపు పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు..మొక్క జొన్న ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ లో అలసత్వం చేయకుండా డిటిసితో సమన్వయం చేసుకొని గోడౌన్ లకు త్వరితగతిన చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాస్ర్క్ఫెడ్ డి ఎమ్ ని ఆదేశించారు.ప్రభుత్వం ఎమ్ఓయు చేసుకున్న కంపెనీలకు సంబంధించిన విత్తనాలను మాత్రమే తీసుకునే విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రచారం చేయాలని ఏపీ సీడ్స్ మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు.కౌలు రైతు లకు ccrc కార్డులను 7315 కు గాను 2273 కార్డులు ఇచ్చేందుకు రైతులను గుర్తించామని డిఏవో తెల్పగా , మిగిలిన రైతులను కూడా త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ డ్రిప్ కి సంబంధించి రైతులకు మెటీరియల్ ఇవ్వలేదని, త్వరితగతిన ఇవ్వాలని సూచించారు.. ఎపిఎమ్ఐపి పిడి ఉమా దేవి స్పందిస్తూ మార్చిలో డ్రిప్ కు సంబంధించిన శాంక్షన్లు ఇవ్వడం జరిగిందని, అందుకు సంబంధించిన మెటీరియల్ మార్చి చివరి నాటికి ఇస్తున్నామని వివరించారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుండి తీసుకొని వాటిని గోడౌన్ చేర్చే క్రమంలో ఆలస్యం అవుతుందని గో డౌన్ కి చేరితే గాని రైతులకు డబ్బులు అందవని, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అలసత్వం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆ విధంగా కాకుండా లోకల్ గా ఉన్న ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి గోడౌన్ కి త్వరితగతిన చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ డి ఎమ్ ని సూచించారు. లొద్దిపల్లి గ్రామంలో టార్పాలిన్స్ రైతులకు అందలేదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు… ఉల్లిందకొండ చెరువులో ముళ్ళకంపలు విపరీతంగా పెరిగిపోయాయని ఫిష్ హార్వెస్ట్ చేసే దానికి ఫిషర్మెన్ కోపరేటివ్ సొసైటీ వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ముళ్ళకంపలు తీసే విధంగా చర్యలు తీసుకోవాలని, చిన్నటేకూరు బైరప్ప చెరువులో ఉన్న సమస్యను కూడా పరిష్కరించాలని ఇరిగేషన్ ఎస్ ఈ ని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.ఎల్.వరలక్ష్మి, పశుసంవర్ధక శాఖ అధికారి డా.రామచంద్రయ్య, మార్కెటింగ్, ఉద్యాన, మార్క్ ఫెడ్ తదితర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News