రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఆర్థికపరమైన డిమాండ్ల సాధన కొరకు ఉద్యమంలో భాగంగా తలపెట్టిన ర్యాలీ విజయవంతమైంది. ర్యాలీలో బాగంగా జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు వేలాదిమంది ఉద్యోగులతో కర్నూలు జేఏసీ చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ వెంగల రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆర్థికపరమైన డిమాండ్లు సాధించేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని, 27న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్లతో చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థికపరమైన డిమాండ్లైన 100 నెలల కరువు బత్యం బకాయిలు, పెండింగ్లో ఉన్న జిపిఎఫ్ రుణాలు, ఎపిజిఎల్ఐ రుణాలు, మూడు సంవత్సరముల నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు, రెండు డిఏ బకాయిలు, పెన్షనర్ల సమస్యలు ఉద్యోగులపై భౌతిక దాడులను అరికట్టాలని 12వ పిఆర్సి ఆలస్యం అవుతున్నందున వెంటనే 30% మధ్యంతర భృతి ప్రకటించాలని 11వ పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చించాలని లేనియెడల చలో విజయవాడ కార్యక్రమం లక్షలాది మందితో చేపడతామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర జేఏసీ సెక్రటరీ జనరల్ హృదయ రాజు, రాష్ట్ర ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, ఏపీ జెఎసి జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్, నగర చైర్మన్ యం. సి.కాశన్న, ఆర్టీసీ నేషనల్ మద్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ టైపిస్టు & స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సి.శంకర్ నాయక్ , ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్, వెటర్నరీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఇస్మాయిల్, రామకృష్ణ, సేవ నాయక్, రామచంద్ర, గోకారి, రవి కుమార్, సురేష్, జనార్దన్, ప్రకాష్ , ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ రావు, ఏఈఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చాంద్ భాష, ఆర్ అండ్ బి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమణ మరియు కర్నూలు జిల్లా ఎన్జీవోస్ నాయకులు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 తాలుకల జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు, పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి మోహన్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, టైపిస్టు & స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు