Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Garla: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

బానోత్ ఆకాష్ ను రోల్ మోడల్ గా తీసుకోండి

విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని ప్రణాళికబద్ధంగా పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని డిఐఈఓ సత్యనారాయణ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ స్పోర్ట్స్ డే ప్రిన్సిపాల్ గోవిందరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి ఐ ఈ ఓ సమ్మెట సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. చదువు సోషల్ స్టేటస్ కాదని ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అందుకు నిదర్శనమే గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి బానోత్ ఆకాష్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -

క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు అత్యంత ఆనందోత్సవాల నడుమ చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి.


ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గోవిందరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ల ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు పి. సదానందం కార్యదర్శి ఎన్ వీరేంద్ర సూపరిండెంట్ మహమ్మద్ ప్రకృతిద్దీన్ హై స్కూల్ హెడ్మాస్టర్ రమేష్ , డిగ్రీ కళాశాల అధ్యాపకులు, లక్ష్మణరావు జూనియర్ కళాశాల అధ్యాపకులు జి రఘుబాబు ఈడబ్ల్యు ఆనంద్ కుమార్ , బానోతు జోగ్య, వేముల రవీందర్, సిహెచ్ సత్యనారాయణ, జి సోమన్న , తోట నాగేశ్వరరావు, జి రాంబాబు, యు శ్రీనివాస్, ప్రసాదరావు,.సుజాత, స్రవంతి, సంధ్య నాన్ టీచింగ్ స్టాఫ్ జి విమల, డి ఎన్ జి పి అంబేద్కర్, రాజశేఖర్ ముత్తయ్య, సత్యనారాయణ, సిద్ధిక్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News