కర్నూలు జిల్లా ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి కొరకు ఇంకా సేకరించవలసిన భూముల వివరాలకు సంబంధించి భూమిని సేకరించు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరియు గ్రీన్ కో అధికారులతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి కొరకు ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాలలో భూములు అవసరమై వాటిని ప్రభుత్వం వారు సేకరించిన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్, కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు ఓర్వకల్ తహసిల్దార్ సమీక్ష సమావేశం నిర్వహించి ఇంకా సేకరించవలసిన భూముల వివరాలు గ్రామాల వారీగా మరియు సర్వే నెంబర్ల వారిగా సమీక్షించి భూమిని సేకరించు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రీన్ కో సోలార్ కంపెనీ వారితో సమీక్షిస్తూ కర్నూల్ ఆర్డీవో మరియు ఓర్వకల్ తహసిల్దార్ ఇరువురు గ్రీన్ కో సోలార్ కంపెనీ వారికి కావాల్సిన భూమి వివరములను పలు గ్రామాల వారిగా సమీక్షించి అవసరమైన భూముల వివరములను కలెక్టర్ కార్యాలయానికి పంపవలసిందిగా జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా ట్రాన్స్మిషన్ లైన్ కొరకు భూముల వివరములను మరియు దేవదాయ శాఖ భూముల వివరములను సేకరించి వారికి చెల్లించవలసిన నష్టపరిహారం వివరాలను తుది పరిశీలనార్థం కలెక్టర్ కార్యాలయానికి పంపవలసిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ విశ్వేశ్వర రావు, గ్రీన్ కో సోలార్ కంపెనీ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.వి.యస్.నాయుడు, డిస్టిక్ లైసెనింగ్ ఆఫీసర్ గోవర్ధన్, కర్నూల్ ఆర్డీవో హరిప్రసాద్ మరియు ఓర్వకల్ తహసిల్దార్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Kurnool: భూసేకరణ త్వరగా చేపట్టండి: జాయింట్ కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES