Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి

Kurnool: ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి

తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ చలో కర్నూలు కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టింది. కర్నూలులోని పలు కళాశాల విద్యార్థులు ధర్నాలో పాల్గొనేందుకు కలెక్టరేట్ కార్యాలయం చేరుకోగా.. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ బయటికి రావాలని నినాదాలు చేశారు. ఒకానొక దశలో విద్యార్థులు కలెక్టరేట్ కార్యాలయ గేట్లు ఎక్కి దూకెందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరగా డి ఆర్ ఓ మధుసూదన్ రావుకు వినతి పత్రం సమర్పించారు విద్యార్థి సంఘ నాయకులు. ఈ కార్యక్రమనికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షత వహించాడు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నామంటూ మరో వైపు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో నాడు నేడు పేరుతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం మంచి విషయమే కాని ఎందుకు ఉపాద్యాయుల పోస్టులు భర్తీ చేయటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడు సంవత్సారాలు కావస్తున్నా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వక, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండా, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ఏవిధంగా మీరు పెద్దపీట చేస్తున్నారో చెప్పాలన్నారు.

కెవిఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో హాస్టల్ నిర్మించుకునేందుకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉన్నత విద్యకు దూరం చేసే జీవో 77 రద్దు చేయాలని హానర్ డిగ్రీని రద్దు చేసి, డిగ్రీ అడ్మిషన్లు ఆఫ్లైన్లో నిర్వహించి 3 సంవత్సరాల డిగ్రీ విధానాన్ని కొసగించాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు ఇవ్వాలని, సంక్షేమ హాస్టల్లకు నాడు-నేడు వర్థింప చేసి సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు 3000 లకు పెంచాలన్నారు . నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజిలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు రావాల్సిన సీట్లను రాష్ట్ర ప్రభుత్వం బి, సి కేటగిరీ పేరుతో అమ్ముకోవటం వల్ల పేద విద్యార్థులు మెడికల్ కోర్సులు 30,40 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుందని తక్షణమే జీవో నెంబర్ 107, 108 జీవోలను రద్దు చేయాలన్నారు.

కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి విద్యార్థులకు కరువు స్కాలర్ షిప్ కింద ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇవ్వాలని చదువు నిమిత్తం బస్ లో వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని అదేవిధంగా అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాయి శీను, జిల్లా నాయకులు అమర్, రవి మల్లేష్, భరత్, గౌస్, పోతురాజు, అంజి, నగర నాయకులు యోగి, అమీర్, గిరి, మూర్తి, మల్లేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News