Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: త్వరలో బంగారం ఉత్పత్తి ప్రారంభం

Kurnool: త్వరలో బంగారం ఉత్పత్తి ప్రారంభం

బి.ఎస్.ఇలో లిస్ట్ అయిన ఏకైక గనుల సంస్థ దక్కన్ గోల్డ్ మైన్

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో ఉన్న బంగారు గనుల్లో 2024 డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దేశంలో ఒక ప్రైవేట్ గనిలో బంగారం కోసం తవ్వకాలు జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఈ ప్రాంతంలో బంగారం గనులను కనిపెట్టి, తవ్వకాలు జరిపిన జియోమైసూర్, దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ సంస్థలు పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపి, ఉత్పత్తిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాయి. మరో పదహారు నెలల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేపట్టాలని ఈ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

- Advertisement -

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్(బి.ఎస్.ఇ)లో లిస్ట్ అయిన ఏకైక గనుల సంస్థ ఈ దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ సంస్థ. ఈ సంస్థ ఇటీవలే జియోమైసూర్ సంస్థలో 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. జియోమైసూర్ కంపెనీ మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో జొన్నగిరి గనుల్లో చాలా కాలం నుంచి
తవ్వకాలు జరుపుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటి ప్రైవేట్ బంగారం గని అని చెప్పవచ్చు. కాగా, ఈ దక్కన్ గోల్డ్ మైన్ సంస్థ దేశంలోనే కాక విదేశాల్లో సైతం వివిధ ప్రాంతాలలో గనుల్లో తవ్వకాలు జరుపుతోంది. చాలా కాలం పాటు కర్ణాటక రాష్ట్రంలో బంగారం తవ్వకాలు జరిపిన ఈ సంస్థ ఆ తర్వాత ధార్వాడ్ లో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నట్టు కనుగొనడం జరిగింది. ధార్వాడ్ ప్రాంతంలోని హుత్తి, ధార్వాడ్-షిమోగా బెల్టులో ఇది తవ్వకాలు జరిపింది. కర్ణాటకలోని గానాజూర్ ప్రాంతంలో కూడా ఇది బంగారం గనుల కోసం ఇది అన్వేషణ సాగిస్తోంది.

ఈ దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ సంస్థ వేలం పాటలో భాలూకోన-జామ్ నిధి గనుల బ్లాక్ ను కూడా చేజిక్కించుకుంది. ఇక్కడ గనుల్లో నికెల్ తవ్వకాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ బ్లాక్ చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ నికెల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేశంలో ఇక్కడ మాత్రమే నికెల్ కేంద్రం ఉంది. సాధారణంగా నూటికి నూరుపాళ్లు దిగుమతి ద్వారానే భారత్ కు నికెల్ సరఫరా అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News