ఆలూరులో వైయస్సార్ సీపీ జెండా ఎగరేద్దామని ఆలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి అన్నారు. ఆలూరు పట్టణంలో పర్యటించిన విరూపాక్షి.. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆలూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం కల్పించాలని కావున ప్రతి ఒక్కరూ ఆదరించి వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం లోని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. టిడిపి నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం జగన్ మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టిడిపి నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సీపీ 175 స్థానాలు విజయం సాధిస్తుందని ఆయన భీమ వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిన్న ఈరన్న, కో కన్వీనర్ వీరేష్,బెల్డోణ సొసైటీ చైర్మన్ మల్లికార్జున, ఆలూరు సొసైటీ చైర్మన్ కిషోర్ పాల్గొన్నారు.