Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: రజకులకు రాజకీయ రిజర్వేషన్లు

Lokesh: రజకులకు రాజకీయ రిజర్వేషన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా నంద్యాలలో పర్యటించి సందర్భంగా ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు 11 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు మాట్లాడుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజకులకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛను ఇవ్వాలని, రజకులకు ప్రతి జిల్లాలో రజక కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయాలని, రజకుల నిరుద్యోగులకు 7500 నిరుద్యోగ భృతి క్రింద ఇవ్వాలని, విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ దేవస్థానాలలో ప్రభుత్వ ఆసుపత్రులలో ధోబీ పోస్టులను కేటాయించి, ప్రభుత్వ జీతాలు కేటాయిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా కల్పించాలని కోరుతూ 11ప్రధాన డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి ఆశయ సాధన లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు సముచిత స్థానం కల్పిస్తూ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు జడ్పిటిసి సభ్యులు కౌన్సిల్ సభ్యులు సర్పంచులు నామినేటెడ్ పదవులను రజకులకు కేటాయించి రాజకీయ రాజకీయ హక్కులు కల్పించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రజకులను మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారం లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని బీసీలకు పెద్దపీట వేశామని బీసీల కోసం 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి పదవులు ఇచ్చి ప్రత్యేక స్థానం కల్పించిన వైఎస్ఆర్సిపి పార్టీ అని వారు గొప్పలు చెప్పుకుంటారని తెలిపారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సందర్భంగా వైయస్సార్ పార్టీ రజకులపై సామాజిక బహిష్కరణలు దాడులు భూకబ్జాలు హత్యలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకులను కట్టడి చేయకుండా ఆయన అమితానందం పొందుతున్నారే తప్ప రజకుల సంక్షేమం ఏమాత్రం పట్టలేదని ఆరోపించారు. అధికార ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రజకులు గుణపాఠం చెప్పాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చమ నాయుడు రజక సామాజిక వర్గం సంక్షేమంపై,రజక ఎస్సీ జాబితా గురించి మీడియా సమావేశాల్లో ప్రస్తావించాలని కోరారు.అనంతరం టిడిపి జాతీయ యువనేత నారా లోకేష్ బాబు క్షుణ్ణంగా పరిశీలించి,రజకుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చినందుకు తప్పనిసరిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా రజకుల పై దాడులు సామాజిక బహిష్కరణలు జరగకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక ఎస్సీ సాధన చైతన్య సమితి నాయకులు జూటూరు వెంకటేశ్వర్లు, డి.చిన్న కొర్రపోలూరు నాగరాజు, డి.శ్రీనివాసులు, నీలం నాగరాజు, ఎం.వి రమణ ఆల్వకొండ మద్దిలేటి, సి.రామమద్దిలేటి,బాల్కొండ హాల్ ఆంజనేలు, వేములపాటి నరసింహ, నందవరం మహేంద్ర, రజక మహిళలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News