వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు పడగా.. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల(Macherla) మున్సిపల్ చైర్మన్ తురక కిశోర్‌పైనా కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. చైర్మన్ పదవి దుర్వినియోగం చేయడంతో పాటు మున్సిపల్ చట్టం సెక్షన్ 16(1) ఉల్లంఘించారంటూ అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కిశోర్‌ను ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అనుమతిలేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు కిశోర్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్‌గా అతడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమాపై దాడి చేసిన కేసుకు సంబంధించి కిశోర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Macherla: వైసీపీకి మరో షాక్.. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌పై అనర్హత వేటు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES