టీడీపీ యువ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని పేర్కొన్నారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు.
“తెలుగుదేశం పొలిట్ బ్యూరో పెద్దలను సూటిగా అడుగుతున్నాను. 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయనపై జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకరి మీద జరగలేదు. అన్ని కష్టాలు పడ్డవారు పార్టీ కోసం ఎవరైనా ఉన్నారా..? అలాంటి వ్యక్తికి కొన్ని పరిమితులు విధించి ఎక్కడో మూలన కూర్చొబెడుతుంటే మాలోంటోళ్లకు చాలా మందికి బాధగా ఉంది. లోకేష్ కష్టంతో దాదాపు 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. చంద్రబాబు గారు వాళ్లు ఏమనుకుంటారో, వీళ్లు ఏమనుకుంటారో, వారసత్వం అనుకుంటారో అని ఆలోచిస్తారు. మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది లోకేష్ ఏ పదవీలో ఉన్నారో తప్ప.. ఆయనపై వచ్చిన విమర్శలు కాదు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.