మల్లాపూర్ గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ‘వనదర్శిని కార్యక్రమం’ నిర్వహించారు. విద్యార్థులకు అడవులను సందర్శింప చేయడం, అడవుల ప్రాముఖత గురించి విడమరిచి చెప్పటం, అడవులలో జరిగే పలు అభివృద్ధి పనులు, కందకాలు తీయడం, చెక్ డాంలు కట్టడం, ట్యాంక్లు కట్టడం, పండ్ల మొక్కలను పెంచడం, నర్సరీలలో మొక్కలు పెంచే విధానం, వాటిని బెడ్లలో అమర్చే విధానం వంటివాటి గురించి ప్రయోగాత్మకంగా తెలియజేశారు. అడవులపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, చిత్ర లేఖన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
