Tuesday, May 21, 2024
Homeచిత్ర ప్రభJawan: షారూఖ్ ఖాన్ 'జవాన్' సినిమాలో అల్లు అర్జున్ ?

Jawan: షారూఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్ ?

పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా స్టార్ గా గ్లోబల్ గా మంచి పాపులారిటీ వచ్చింది. తమిళ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ లో తీస్తున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తుండగా తాజాగా అల్లు అర్జున్ ను కూడా క్యామియో రోల్ కోసం తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

జవాన్ లో స్పెషల్ రోల్ ద్వారా బాలీవుడ్ లో ఐకన్ స్టార్ బన్నీ అడుగు పెట్టబోతున్నారు. అట్లీ సినిమాలో రోల్స్ అంటే జనరల్ గా యాక్టర్స్ ఎవరూ నో చెప్పకుండా కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేసేస్తారంతే. లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా అట్లీ గ్యాంగ్ లో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మల్టీ స్టారర్, అందునా షారూఖ్ సినిమాలో యాక్ట్ చేయటాన్ని ఎవరూ కాదనరని బాలీవుడ్ కూడా చెబుతోంది. రుద్రమ దేవి సినిమాలో బన్నీ క్యామియో రోల్ ప్లే చేయటం ఆడియన్స్ కు ఇంకా బాగా గుర్తుంది. జూన్ 3వ తేదీన జవాన్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి లేడీ సూపర్ స్టార్ నయన్ అడుగు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News