Monday, April 7, 2025
Homeఆంధ్రప్రదేశ్Aghori: అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి

Aghori: అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి

వివాదాస్పద లేడీ అఘోరీ(Aghori) చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణిని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని లోబరుచుకుంది.

గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు వాపోతూ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News