ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర డిటిఎఫ్ నిరసన కార్యక్రమం చేపట్టారు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బి రామన్న, ఈశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగానికి శాపంగా మారిన జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రంలోని, అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంకు సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలన్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత పెన్షన్ స్థానంలో సిపిఎస్ జిపిఎస్ అని రకరకాల విధానాలను రద్దుచేసి ఓ పి ఎస్ ను మాత్రమే అమలు చేయాలని అన్నారు. గత రెండు సంవత్సరములుగా పాఠశాలకు మెయింటినెన్స్ నిధులు విడుదల చేయాలన్నారు. పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయులకు చాలా కష్టంగా ఉందన్నారు. పిఆర్సి ఆలస్యం అయ్యే సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే మద్యంతర భృతిని ప్రకటించాలన్నారు. నిరసన కార్యక్రమంలో డిటిఫ్ కార్యకర్తల తోపాటు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మ శ్రీను, శివశంకర్, రామకృష్ణ,ఈరన్న, హరి ప్రసాద్ , ఉమామహేశ్వరి, వీణ కుమారి, సాజర సుల్తానా, హైమావతి,సువర్ణ రాష్ట్ర కార్యదర్శి గోట్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు.