Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: తెలుగు మహిళలు రిలే నిరాహార దీక్ష

Mantralayam: తెలుగు మహిళలు రిలే నిరాహార దీక్ష

చంద్రబాబుకు సంఘీభావంగా..

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కు నిరసనగా మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో మంత్రాలయంలో తెలుగు మహిళలు మేము సైతం అంటు రీలే నిరహౕర దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేయలేక, ప్రజలలో కి పోవడానికి కూడా చేతగాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ,రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అని కక్షతోనే అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనం అని అన్నారు.. ఈ రోజు మహిళలు కూడా చంద్రబాబుకు మద్దతుగా బయటికి వచ్చి దీక్షలు చేస్తూంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పోతారు అని తిక్కారెడ్డి అన్నారు.. ఈ దీక్షకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, కురువ సాధికార రాష్ట్ర నాయకులు నాగరాజు, జయ రాముడు , యల్లప్ప, భానుప్రకాష్ సంఘీభావం తెలియజేశారు..

- Advertisement -

ఈ దీక్షలో పాలకుర్తి వెంకటేశ్వరమ్మ , పాలకుర్తి కల్పనమ్మ , రాష్ట్ర నాయకురాలు నరవ శశిరేఖ . మాలపల్లి రాగవేణమ్మ, తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి నాడిగేని నరసమ్మ, రూతమ్మ, శంకుతలమ్మ, లక్ష్మి, చావిడి రామలక్ష్మి, మాధవరం కావ్య, మాధవరం నిర్మలమ్మ, బెళగల్ సర్పంచ్ పద్మమ్మ, దుద్ది సర్పంచ్ వరలక్ష్మి, చిన్న భూంపల్లి గోవిందమ్మ, ఈరేశమ్మ, పెద్ద భూంపల్లి లక్ష్మి, నాగలక్ష్మి, కోల్మ్ మేన్ పేట మంగమ్మ, పాల్గొన్నారు.. వీరికి మద్దతు గా సంఘీభావం తెలిపిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్,తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, బిసి సీనియర్ నాయకులు వక్రాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News