Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: శ్రీమఠంలో టూరిస్టు పోలీసు స్టేషన్ ప్రారంభం

Mantralayam: శ్రీమఠంలో టూరిస్టు పోలీసు స్టేషన్ ప్రారంభం

మంత్రాలయం శ్రీమఠంలో ‌ఏపీ టూరిస్టు క్యాంపు కార్యాలయం ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం టూరిస్టు పోలీస్టేషన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత, సేవాభావంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 పర్యాటక ప్రాంతాలలో టూరిస్టు పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈటూరిస్టు పోలీసుస్టేషన్ లో ఒక ఎస్సై ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసులు రొటేషన్ పద్దతిలో విధులు నిర్వహిస్తారు. మంత్రాలయంకు శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్ధం సామాన్య భక్తులే కాకుండా, పాదయాత్ర భక్తులు, ప్రజా ప్రతినిధులు, వీఐపీలు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా ఇకపై ఈటూరిస్ట్ పోలీసింగ్ విధానం సమర్థ వంతంగా అమలు కానుందన్నారు. పోలీస్ శాఖకు శ్రీమఠం ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుబుధేంద్ర తీర్థులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News