నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
- Advertisement -
తుఫాన్ కు మిచౌంగ్ గా నామకరణం
ప్రస్తుతానికి చెన్నైకి 310 కి.మీ, నెల్లూరుకు 440 కి.మీ, బాపట్లకు 550 కి.మీ, మచిలీపట్నానికి 550 కి.మీ. దూరంలో ఉన్న తుఫాన్
మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో ఈరోజు నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదు
రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~ డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ