ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తోకలసి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి బుక్లెట్ ద్వారా వివరంగా వివరించి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే తెలపాలని ఎమ్మెల్యే గంగుల అన్నారు. కాలనీలలో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించింది అన్నారు. ఈ పథకాల కొంతలో కొంత చేదోడైందన్నారు గతంలో సంక్షేమ పథకాలు అందాలంటే రికమండేషన్లు పెడితే గాని ఫలాలు అందేవి కావని అలాకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఉద్దేశంతోనే కుల మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాధనం దోచుకుమని లైసెన్స్ ఇచ్చారా అని ఎమ్మెల్యే గంగుల ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉండగా సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 371 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్నారని ప్రభుత్వ న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకొని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. చట్టం తన పని తాను చేసుకోపోయిందని ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని చట్టానికి అందరూ సమానులేని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్, బుడ్డా చంద్రమోహన్ రెడ్డి, కర్రా హర్షవర్ధన్ రెడ్డి ఆరికట్ల శివరాం రెడ్డి మహేశ్వర్ రెడ్డి కర్నాటి చంద్ర హౌస్ రెడ్డి ఎస్సై సత్యనారాయణ ,సచివాలయ సిబ్బంది అధికారులు.. వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MLA Gangula: అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు
గడప గడపకులో ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES