Tuesday, April 23, 2024
Homeపాలిటిక్స్Kosigi: ముచ్చటగా మూడోసారి ఓడిస్తా

Kosigi: ముచ్చటగా మూడోసారి ఓడిస్తా

తిక్కారెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి

తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇంచార్జీ తిక్కారెడ్డి నీతోనే డీ, అని నిన్ను ముచ్చటగా మూడోసారి ఓడిస్తా అని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తిక్కారెడ్డికి సవాల్ విసిరాడు. కోసిగి మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు యంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ, యంపీపీ ఈరన్న, జడ్పీటీసీ శ్రీమతి పవిత్ర పాటిల్, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నాడిగేని నరసింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన పించనుదారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయపరంగా అరెస్టు జరిగిందని, అరెస్టు అక్రమమైతే ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద లాయర్లు బెయిల్ మంజూరు చేయించవచ్చు కదా అని హెద్దేవా చేశారు. ఇంకా మన నియోజకవర్గానికి వేస్తే తిక్కారెడ్డి తన అనుచరులకు రెచ్చగొట్టే మాటలను ప్రేరేపిస్తూ, మాయల ఫకీరు వేషాలతో దీక్షలకు పూనుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల పెద్ద మనస్సుతో మూడుసార్లు నన్ను ఎమ్మెల్యేగా రాజకీయ భిక్ష ప్రసాదించారని గుర్తు చేశారు. ఎక్కడా లేని విధంగా ఒకే కుటుంబ చరిత్రలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, మరొక్కరు టిటిడి బోర్డు సభ్యులుగా ఉండటం ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం, ఆ దేవుని దయతో కోనసాగుతున్నామని, మా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేమని అందరి సమక్షంలో మాటిచ్చారు. కోసిగి మండలానికి 2వేలకు పైగా కొత్త పించన్లు మంజూరు కాగా, ఈ నెల రెండోవిడత పించనుదారుల ఆత్మీయ సమ్మేళనంలో పించనుదారులను ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షులు బెట్టనగౌడ్, ఆదినారాయణ శెట్టి, నాడిగేని నాగరాజు, మాణిక్యరాజు, జగదీష్ స్వామి, కో ఆప్షన్ మెంబర్ షౌఖత్ అలీ, జంపాపురం బసిరెడ్డి, దొడ్డి నర్సన్న, నరసింహులు గౌడ్, కాల్వ లక్ష్మయ్య, బుళ్ళి నరసింహులు, మల్లికార్జున గౌడ్, దుద్ది నాగేష్, లంకారెడ్డి, నూర్, కోసిగయ్య, వీరస్వామి, నాగేంద్ర, దళవాయ్ గోపాల్, వివిధ గ్రామాల సర్పంచ్లు, యంపీటీసిలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News