ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత శిశు మరణాలు తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశాల జారీ చేయగా రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాల్లో మరింత పగడ్బందీగా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రారంభించారు. పత్తికొండ ఐసిడిఎస్ కార్యాలయం నందు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భవతి బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుంచి బాలింతలు గర్భవతులకు ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహార సంపూర్ణ పోషణ కిట్లను ఇంటి వద్దకే అందిస్తారని.వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం పకడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు సిడిపిఓ సావిత్రి వైసీపీ మండల కన్వీనర్ కారం నాగరాజు. జిల్లా నాయకులు శ్రీరంగడు.మల్లికార్జున్ రెడ్డి. కృష్ణారెడ్డి.వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MLA: మాతా శిశు మరణాలు తగ్గేందుకు కృషి చేయాలి-శ్రీదేవి
ఇంటి వద్దకే పౌష్టిక ఆహార సంపూర్ణ పోషణ కిట్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES