నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డు దేవ నగర్ 2 లో 153 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వార్డ్ కోఆప్షన్ సభ్యులు శోభారాణి వార్డు ఇన్చార్జ్ భాష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాదరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై ఎమ్మెల్యే ఆరా తీసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధిని గాలికి వదిలేసిందని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల అభివృద్ధి జరుగుతుందని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే రావడంతో ప్రజలు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో అర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు.
నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీసా వైస్ చైర్మన్ ఫామ్ షావలి పట్టణ అధ్యక్షులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, పున్న శేషయ్య, జాకీర్ హుస్సేన్ ,జిల్లా కల్చరల్ వింగ్ అధ్యక్షుడు టి వి రమణ, కోఆప్షన్ సభ్యులు సలాంముల్లా, వైసిపి కౌన్సిలర్లు పున్న రాజేశ్వరి, అనురాధ, సావిత్రమ్మ, సాదిక్ భాష, మేష చంద్రశేఖర్, వైసిపి నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, గాన్ని కరీం, ప్రదీప్ రెడ్డి, వార్డు వైసిపి నాయకులు కారు రవికుమార్ ,బి ఇమ్మానియేల్, ముత్తయ్య, ఎస్ రవికుమార్, కరీముల్లా, మోహన్, సనత్ ,ఈశ్వర్ ,శ్రీను, అఖిల్, శివ, ఇర్ఫాన్, కులాయి భాష , మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.