Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్MLA Sudhakar: జగనన్నతోనే రాష్ట్ర భవిష్యత్తు

MLA Sudhakar: జగనన్నతోనే రాష్ట్ర భవిష్యత్తు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అన్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలంలోని జులకల్ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు ఓర్చుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా నియోజవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరిగిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, బోయ లక్ష్మన్న, ఎంపీడీవో మాధవి శ్రీలత, ఏపిఎం నాయకల్ సుధాకర్, వైసీపీ నేతలు దండు శీను, రాముడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News