YCP| వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ (Jayamangala venkata ramana) రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ మోసేను రాజుకు పంపించగా.. పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపించారు.
కాగా కైకలూరు నియోకజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీతో అంటీముట్టనట్లు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి వెంకటరమణ రాజీనామా చేశారు