Mohan babu: నటుడు మంచు మోహన్ బాబు తన కుటుంబం వివాదం నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌ను పోలీసులకు డిపాజిట్ చేశారు. తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్‌ను తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. రెండు రోజుల క్రితం గన్ డిపాజిట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీలో కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రిపోర్టర్ల ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు మోహన్ బాబు పీఆర్వో సహా ఆరుగురు బౌన్సర్లకి 41ఏ నోటీసులు జారీ చేశారు. మరోవైపు తనకు ప్రాణభయం ఉందంటూ మంచు మనోజ్ మరోసారి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి మంచు వారి కుటుంబం వివాదం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంటుంది.