Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Mudragada: 'మా నాన్నకు క్యాన్సర్'.. ముద్రగడ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Mudragada: ‘మా నాన్నకు క్యాన్సర్’.. ముద్రగడ కుమార్తె సంచలన వ్యాఖ్యలు


వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి(Mudragada Padmanabham)క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆయన కుమార్తె క్రాంతి(Kranthi) ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ఆమె సోదరుడు, ముద్రగడ కుమారుడు గిరిపై సంచలన ఆరోపణలు చేశారు.

‘మా నాన్న ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ఆయనకు అత్యవసరంగా అందించాల్సిన చికిత్సను నిరాకరిస్తున్నారు.. ఈ విషయంలో నేను తీవ్రంగా ఆందోళనతో ఉన్నాను. ఇటీవల ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.. కానీ నా సోదరుడు గిరితో పాటూ అతని మామ మా నాన్నగారిని కలవడానికి అనుమతించలేదు. నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు.

ఆయన బంధువులకు, ఎప్పటి నుంచో వెంట నడస్తున్న అనుచరులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గిరితో పాటూ అతని అత్తమామల సన్నిహితులు మా నాన్నను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని.. ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని నాకు తెలిసింది. గిరి ఇది అమానుషం, ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే.. నాకు కచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మా నాన్నగారికి సంరక్షణ అవసరం’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ, ఆయన కుమార్తె క్రాంతి మధ్య రాజకీయ వైరం తలెత్తిన సంగతి తెలిసిందే. ముద్రగడ వైసీపీకి మద్దతు ఇస్తే.. క్రాంతి జనసేనకు సపోర్ట్ ఇచ్చారు. దీంతో ఆమె తన కూతురు కాదంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి తండ్రి ముద్రగడకు ఆమె దూరంగానే ఉంటున్నారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad