Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ

Nandavaram: బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ

మినీ మేనిఫెస్టోతో టిడిపి నాయకులు ఇంటింట ప్రచారం

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి మండల నాయకులు మండల పరిధిలోని ఇబ్రహీంపురం, మాచాపురం గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు గురురాజ్ దేశాయ్, టిడిపి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, మండల క్లస్టర్ ఇంచార్జ్ కాశిం వలి ఇబ్రహీంపురం, మాచాపురం గ్రామాలలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ఇటీవల మహానాడు కార్యక్రమంలో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల దృష్టికి తీసుకు వెళ్తూ వారితో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, అధికారం చేపడితే ప్రతి కుటుంబానికి టిడిపి ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ లోని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయలు అందబోతుందని ఇందులో భాగంగా అన్నదాతకు 20,000, ఆడబిడ్డ నిధి 18000, తల్లికి వందనం 15000, యువ గళం నిధి 36000, దీపం పేరుతో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కనెక్షన్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, పేదల కోసం పూర్ టు రిచ్ వంటి సంక్షేమ పథకాలు అందిస్తామంటూ ప్రజలకు భరోసా కల్పించారు. వైసిపి ప్రభుత్వం గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో విద్యుత్ చార్జీలు, నిత్యవసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా ప్రజలకు అనునిత్యం అవసరమయ్యే ప్రతి వస్తువుపై రేట్లను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెను భారాన్ని మోపి ప్రజలను నిలువు దోపిడీ చేశారని, కంటి తూడ్పు కోసం నవరత్నాల పేరుతో కొన్ని సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగిస్తున్నారని ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఇకనైనా ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వ మాయలోనుంచి బయటికి వచ్చి ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించేలా పునరాలోనించి రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు రామన్న గౌడ్, వీరేష్, బడేషావలి, వెంకట్రాముడు, రంజాన్, నాగేష్, ఐ టీడీపీ మండల అధ్యక్షులు కైరవడి వీరేష్, చంద్రశేఖర్ రెడ్డి, శంకరమ్మ, బోయ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News