నందవరం మండలంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధ్య వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయా అన్నట్టుగా మండలంలో నిర్వహించిన లోకేష్ యువగళం పాదయాత్ర సాగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్ మాధవరావ్ దేశాయ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లపై టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో ప్రజలు ఊహలు నిజమేమోనని క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులలో అలజడి మొదలైంది. ఇదే నిజమన్నట్టుగా దేశాయ్ వర్గీయులు, అభిమానులు, కార్యకర్తలు యువగళం పాదయాత్రలో మండలం మొత్తం దూరంగా ఉండి నందవరం గ్రామంలో యాత్ర ప్రారంభంలో మాత్రం చినబాబు లోకేష్ కు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ అవుతున్న సమయంలో స్వాగతం పలకడానికి వెళ్ళిన మాజి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, పూలచింత టిడిపి నాయకులు బండే గురు స్వామిలను లోకేష్ బాబు రక్షన సిబ్బంది నెట్టివేయడంతో క్రిందకిపడడం జరిగింది. ఈ విషయానికి మనస్తాపం చెందిన బండే గురుస్వామి అక్కడినుండి వెళ్ళిపోవడం జరిగిందని. కనకవీడు టిడిపి సీనియర్ నాయకులు మాజి వైస్ ఎంపీపీ రఘుమూర్తి స్వామి సైతం కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో టిడిపిలో వర్గ వేదాలు తారాస్థాయికి చేరుకోనున్నాయ అన్నట్లుగా జరుగుతున్న సంఘటనలు దృష్ట్యా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
Nandavaram: యువగళం పాదయాత్రలో విభేదాలా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES