నందవరం మండల కేంద్రంలో కొందరు ప్రజలు నిర్వహిస్తున్న పెళ్లి ఊరేగింపు కార్యక్రమంలో డిజే సౌండ్ సిస్టంల మోతతో గ్రామంలోని ప్రజలకు రోతగా ఉందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజలు నిర్వహించుకుంటున్న పెళ్లి ఊరేగింపులలో పెద్ద పెద్ద డిజే సౌండ్ సిస్టంతో ఊరేగింపులు నిర్వహించడం పరిపాటిగా మారింది. కానీ మనము సంతోషంగా నిర్వహించే కార్యక్రమము పక్కవారిని ఇబ్బంది గురి చేసేలా ఉండకూడదని స్థానికులు అంటున్నారు. నందవరం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పెళ్లి ఊరేగింపులలో పెద్ద పెద్ద శబ్దాలు చేసే డిజె సౌండ్ సిస్టం పెట్టడమే కాకుండా, రాత్రంతా ప్రజలు నిద్రించే సమయంలో రాత్రి రెండు, మూడు, నాలుగు గంటల వరకు ఊరేగింపు నిర్వహించడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలను అడ్డుకోవలసిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలను సంబంధిత అధికారులు అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Nandavaram: డిజేల మోత ప్రజలకు రోత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES