Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: సద్గురు బండే గురు 118 వ జాతర

Nandavaram: సద్గురు బండే గురు 118 వ జాతర

5వ తేదీ నుంచి..

మండల పరిధిలోని పూలచింత గ్రామంలో మార్చి 5 మంగళవారం శ్రీశ్రీశ్రీ సద్గురు బండే గురువుల 118 వ జాతర మహోత్సవమును శ్రీ వరబండే గురు మఠం 5 వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయ శంకర స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శ్రీ వరబండే గురు మఠంలో రెండు సంవత్సరాల క్రితం శ్రీ కాశీ లింగాన్ని ప్రతిష్టించడంతో భక్తులు శ్రీ వరబండే గురు మఠంను శ్రీ కాశీ లింగ క్షేత్రపురిగా కీర్తిస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కొలిచిన వారికి కొంగుబంగారంగా స్వామి వారిని విశ్వసిస్తారు. శ్రీ వరబండే గురు జాతర మహోత్సవానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని కావున రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు మఠం ఉప పీఠాధిపతి బండే గురుస్వామి వెల్లడించారు.

- Advertisement -

మార్చి 5 మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు సుప్రభాత సేవ, శ్రీ బండే గురు మూర్తికి రుద్రాభిషేకం, 10:00 గంటల నుండి అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం 2:00 గంటల నుండి పల్లకి, నందికోలు సేవ, శ్రీవారి మూలస్థానానికి పూజా కార్యక్రమములు నిర్వహించి, సాయంత్రం 4:30 గంటలకు ప్రబోత్సవం, రాత్రి 10:00 గంటలకు అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తారని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News