టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర బందులో భాగంగా నందవరం మండలం పరిధిలోని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన నాగలదిన్నె వంతెన దగ్గర నిరసనలో భాగంగా బందు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బివి జనాగేశ్వర్ రెడ్డి, టిడిపి మండల నాయకులు గురు రాజ్ దేశాయ్, ఎస్ కాసిం వలి, చిన్న రాముడు, రాయచోటి రామకృష్ణారెడ్డి లను ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, నందవరం యస్ ఐ తిమ్మయ్య వారి సిబ్బందితో కలిసి నిర్బంధించి ఎమ్మిగనూరు పోలీస్ కార్యాలయానికి తరలించారు.
బి వి జయనాగేశ్వర్ రెడ్డి ని మండల నాయకులను అరెస్టు చేసి తీసుకు వెళ్తున్న వాహనాలముందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బివి జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్య స్థితిని ఈరోజు మనం అనుభవిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహా మేధావి నారా చంద్రబాబు నాయుడు అలాంటి మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ పౌర హక్కుల లో భాగంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ మా నిరసనను భంగం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని మా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక రౌడీషీటర్ల వలె ముందస్తు హౌస్ అరెస్టులను చేయించడం పౌర హక్కులకు భంగం కలిగించడం కాదా.. రాజ్యాంగ ఉల్లంఘన కాదా.. అని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్తూ ప్రజలలో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడుతూ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలు నుండి వచ్చే ఆధార అభిమానులను చూసి ఓర్వలేక ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి నీచమైన రాజకీయ దుశ్చర్యలకు పాల్పడుతుందని వారు విమర్శించారు. కావున రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్వచ్ఛందంగా టిడిపి రాష్ట్ర బంద్ పిలుపులో పాల్గొని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబునాయుడు కి న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు గౌడ్, హాలహర్వి నారాయణరెడ్డి, ధర్మాపురం గోపాల్, ముగతి భార్గవ్, బాలరాజ్, తిప్పారెడ్డి, కైరవాడి వీరేష్, శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ రామన్న గౌడ్, మిట్టసోమపురం వీరేష్, బెస్త ఈరన్న, మల్లికార్జున, శ్రీనివాసులు, సాదిక్ భాషా, శివ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.