Sunday, July 14, 2024
Homeనేరాలు-ఘోరాలుNandyala: పోలీసు స్పందనకు 40 ఫిర్యాదులు

Nandyala: పోలీసు స్పందనకు 40 ఫిర్యాదులు

విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి 40 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, స్పందన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ వెంకట రాముడు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జె.వి సంతోష్, సీఐ సూర్యమౌళి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News