Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: 'ఆడుదాం ఆంధ్రా' క్రీడలపై చైర్మన్ సుధాకర్ రెడ్డి సమీక్ష

Nandikotkuru: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడలపై చైర్మన్ సుధాకర్ రెడ్డి సమీక్ష

క్రీడల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులది కీలకపాత్ర

నందికొట్కూరు మండలంలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ మేనేజ్మెంట్లకు మరియు జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లకు నందికొట్కూరులోని స్ధానిక మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ నందు “ఆడుదాం ఆంధ్ర – 2023” సమీక్ష సమావేశం మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ నిర్వహించని విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో 51 రోజులపాటు 5 క్రీడాంశాల్లో “ఆడుదాం ఆంధ్ర” క్రీడలు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్నారని తెలిపారు. పట్టణంలోని 14 సచివాలయాలలో ఈ క్రీడాంశాలు నిర్వహిస్తున్నామని సిద్ధార్థ రెడ్డి అభిమానులు, వార్డు కౌన్సిల్ మెంబర్లు, ఇంఛార్జి లు, వైయస్సార్సీపి శ్రేణులు ఈ క్రీడల విజయవంతములో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, వార్డు వాలంటీర్లు క్రీడాకారులను అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. అలాగే ఏ క్రీడలు విజయవంతం కావాలన్నా వ్యాయామ ఉపాధ్యాయుల సహకారం అవసరమని ప్రభుత్వం నిర్వహించబోయే ఈ క్రీడల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. క్రీడల నిర్వహణకు అవసరమయ్యే ఏర్పాట్లను చేయడానికి, మౌళిక వసతులను కల్పించడానికి మున్సిపాలిటీ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో 24 వార్డు కౌన్సిలర్లు చాంద్ బాషా,1 వ వార్డు కౌన్సిలర్ చిన్నరాజు, 11 వ వార్డు ఇంఛార్జి రజనీ కుమార్ రెడ్డి,నంద్యాల మరియు కర్నూలు జిల్లాల శాప్ కో- ఆర్డినేటర్ లు స్వామిదాసు రవి కుమార్, శ్రీనాథ్ పెరుమాళ్ళ, నియోజక వర్గ ఇంఛార్జి డోరతి, మండల ఇంఛార్జి వీరన్న, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాలేజి ఫిజికల్ డైరెక్టర్ ఆసిఫ్ ఫిజికల్ డైరెక్టర్ లు విజయ కుమారి, జెసింత, రాజేశ్వరి,సరస్వతి, పద్మ లత, సుంకన్న, రాగన్న, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News