నందికొట్కూరు పట్టణంలో సాయంత్రం తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ల అశేష జనవాహిని మధ్య టిడిపి నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభ కొనసాగింది. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సినీ నటుడు, టిడిపి నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య తరలివచ్చిన వేలాది మంది టిడిపి కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తూ కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ పటేల్ సెంటర్ వరకూ సాగింది.
పటేల్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల సంక్షేమం కొనసాగాలి అంటే అది పసుపు జెండా టిడిపి పార్టీ తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పసుపు అంటే సంపూర్ణ ఆరోగ్యానికి, భరోసాకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, టిడిపి పార్టీ పట్ల ప్రజలకు పెరిగిన విశ్వాసం నమ్మకం చూసి వైసిపి పార్టీ నేతల గుండెల్లో భయం మొదలైందని విమర్శించారు. కూటమి అభ్యర్థులు ప్రజాసంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలపారని, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్యను, పార్లమెంట్ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని ఓటుతో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
నియోజవర్గ అభివృద్ధి రైతన్నల కోసం సంక్షేమానికి పాటుపడుతా :
ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతన్నల వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప పరిపాలన నేత చంద్రబాబు నాయుడు అని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసుర్య పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు. అధినేత చంద్రబాబు మాపై ఉంచిన నమ్మకాన్ని ప్రజల గెలుపుతో సాధించి ఆయనకు బహుమతిగా అందచేయాలని అందుకు ప్రజలందరూ ఓటుతో ఆశీర్వదించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.
వచ్చే ఎన్నికల సమరంలో ప్రజల ఆశీర్వాదంతో నియోజవర్గానికి చెందిన వ్యక్తులుగా, నియోజవర్గంపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిమ్మను గెలిపించాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయకత్వంలో మాండ్ర శివానందరెడ్డి ఆశీస్సులతో నియోజవర్గాన్ని మరింతగా అభివృద్ధి పరుస్తానని, నియోజవర్గ రైతంగం కోసం పాటుపడతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
అశేష జన వాహిని మధ్య జరిగిన బహిరంగ సభకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందికొట్కూరు పట్టణ రూరల్ సీఐలు విజయభాస్కర్, ప్రకాష్ కుమార్ లు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసేన, కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.