Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: 'గడపగడప'లో ఎమ్మెల్యేకు భంగపాటు

Nandikotkuru: ‘గడపగడప’లో ఎమ్మెల్యేకు భంగపాటు

పగిడ్యాల మండలంలోని పడమర ప్రాతకోట గ్రామంలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యే ఎమ్మెల్యే ఆర్థర్ కు వాలంటీర్ల నుంచి బంగపాటు తప్పలేదు. కార్యక్రమానికి వాలంటీర్లు గైర్హాజరు కావడంతో బుక్లెట్ల పంపిణీకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎంపీడీవో వెంకటరమణ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దానిపై స్పందించిన ఎమ్మెల్యే వాలంటీర్లు రాకపోతే కార్యక్రమాన్ని నిర్వహించలేమని పూర్తిస్థాయిలో వాలంటీర్లు పాల్గొంటేనే తనను కార్యక్రమానికి పిలవాలని ఎంపీడీవోకు హుకుం జారీ చేశారు. ఇటు వాలంటీర్లు అటు ఎమ్మెల్యే మధ్య అధికారులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. నాడు నెహ్రూ నగర్ లో జరిగిన సంఘటనే పడమర ప్రాతకోటలో ఎదురవడంతో గోరుపై రోకటి పోటు అన్న చందంగా అధికారులు నలిగిపోతున్నాం మండలంలో చర్చిని అంశంగా మారింది. అయితే వాలంటీర్లు మాత్రం టిడిపితో జతకట్టిన ఎమ్మెల్యే అనుచరులతో కలిసి గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించేది లేదని కరాకండిగా కుండ బద్దలు కొడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలను ఎమ్మెల్యే అనుచరులు టిడిపి కార్యకర్తల పాదాల వద్ద తాకట్టు పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేయస్సు కోసం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రాణాలనైన పణంగా పెడతామని ఆత్మాభిమానం చంపుకుని టిడిపి తో జత కట్టిన ఎమ్మెల్యే అనుచరులతో కలిసి పని చేయలేమని అధికారులతో పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజాహితం కోసమే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం హర్షణీయమని అందుకు వాలంటీర్లు అంకితభావంతో పనిచేసే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర షాప్ చైర్మన్ బయట సిద్ధార్థ రెడ్డి సొంత మండలంలో టిడిపి నాయకులుపెత్తనం ను సహించేది లేదని అధికారులు తమపై ఎలాంటి చర్యలు తీసుకున్న జంకె ప్రసక్తి లేదన్నారు. సిద్ధార్థ రెడ్డి, పార్టీ మర్యాదలకు బంగం వాటిలితే సహించమని వాలంటీర్లు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే తన పంతాను మార్చుకొని వాలంటీర్లతో గడపగడప కార్యక్రమాన్ని పూర్తి చేస్తారో లేదో వేచి చూడాల్సిందే…

- Advertisement -

జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడప కార్యక్రమం నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో జరగడం అసంభవం అనిపిస్తుంది ఎందుకంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ గారికి నియోజకవర్గంలో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి హవాతో పాటు రాష్ట్రంలో యువ నాయకునిగా చలామనవుతున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి హవా కలిసి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్థర్ ఎన్నికలైనా వారం తర్వాత నుంచే నియోజకవర్గ ఇన్చార్జిగా తన గెలుపు కోసం పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో పాటు ఆయన అనుచర వర్గాన్ని మొత్తం దూరం నుంచి తెలుగుదేశం పార్టీలో లేదా వేరే రాజకీయ పార్టీల లో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొంతమందిని కలుపుకొని సొంత వర్గం పేరిట రాజకీయాన్ని సలుపుతున్న ఆర్థర్ కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది బైరెడ్డి సిద్దార్థ రెడ్డి స్వంత మండలము లో గడప గడప కార్యక్రమం నిర్వహించడం పగిడ్యాల మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో గడప గడప కార్యక్రమం కోసం గత నెలలో మండల స్థాయి అధికారులు సిబ్బందినీ అంతా వెంటపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ఇంటింటికి బయలుదేరే సమయంలో వాలంటరీలు ఎవరు హాజరు కాలేదని అధికారులు చెప్పడంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆర్థర్ అధికారులపై కోపగించుకొని ఏమి చేయలేక వెనిదిరిగాడు మళ్లీ అదే మండలంలోని పెద్ద గ్రామపంచాయతీ అయినా పాతకోటలో గత వారం రోజుల నుంచి మూడు తేదీలు మార్పు చేసుకుని ఈరోజు ఉదయం మండల స్థాయి అధికారులు సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే వర్గం కార్యకర్తలు అంత బంజంత్రీలతో ఆహ్వానం పలకడానికి ప్రాతకోట గ్రామ శివారుకు చేరుకుని ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తుండగా వాలంటరీలు ఎవరు హాజరు కాని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండలం ఎంపీడీవో గారికి స్థానిక ఆయన వర్గానికి చెందిన నాయకులకి ఫోన్ చేసి వాలంటరీలు హాజరు కాకుండా నేను రాలేనని ఇప్పటికే నెహ్రు నగర్ గ్రామ లో మర్యాద పోగొట్టు కున్నాను అని కాబట్టి రాలేను అని అర్ధాంతరంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్న అధికారులు నాయకులు అవాక్కయి చేసేదేమీ లేక అధికారికంగా గడప గడపకూ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మండల ఎంపిడిఓ గారు, నిజంగా పగిడ్యాల మండలం రాష్ట్రంలోనే తక్కువ సమయంలో రాష్ట్ర స్థాయి నేత గా గుర్తింపు పొందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి సొంత మండలం ఇక్కడ ఉన్న వాలంటీర్లు గాని ప్రజలు కానీ నాయకులు గానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి అనుమతి లేకుండా ఎవరు ముందుకి వెళ్ళే అవకాశం లేదు అనే విషయం సృష్టంగా తెలిసి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ గడపగడప కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జి అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కనీసం సమాచారం ఇవ్వకుండా మొండిగా ఎమ్మెల్యే ఒక్కడే వెళ్ళి ఇప్పటికి రెండు ప్రధాన గ్రామాలైన ప్రాతకోట నెహ్రునగర్ లలో భంగపడడం ఆయన రాజకీయ పరిపక్వతను తెలియజేస్తుందని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో అయినా జగనన్న ప్రతిష్మాతకంగా ప్రవేశపెట్టిన గడపగడప కార్యక్రమాన్ని గట్టెక్కించాలంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి ముందుకు వెళ్తే తప్ప పగిడ్యాల మండలంలో గడపగడప గట్టెక్కి అవకాశం లేదు అనే విషయం ఎమ్మెల్యే తెలుసుకుంటారో లేదో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News