Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఖంపు కొడుతున్నా పట్టదా?

Nandikotkuru: ఖంపు కొడుతున్నా పట్టదా?

గత 35సంవత్సరాల క్రితం జంతువదశాలను పట్టణములోని రెండో వార్డు పరిధిలో శాంతి థియేటర్ ప్రక్కన రెండు భవనాల సముదాయలతో ఏర్పాటు చేశారు. నేడు మున్సిపాలిటీకి ప్రధానమైన ఆదాయ వనరులలో జంతువధ శాల ఒక్కటి. ప్రజల ఆరోగ్య సంబంధమైన మాంసాహారం విక్రయాల సముదాయాలు నేడు దుర్వాసన వెదజల్లుతూ పారిశుద్ధ్య లోపంతో రోగాలకు నిలయంగా మారిపోయాయి. ఈ మటన్ మార్కెట్ వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వున్నా వాటి వసతులను ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.. అదే విదంగా నియోజకవర్గములో ని వివిధ గ్రామాల, మరియు పట్టణంలో వందలాది మాంసం హర ప్రియులు ఈ సముదయాలలోనే మాంసాహారని కొనుగోలు చేసేందుకు రాకపోకలు నిర్వహిస్తారు . పట్టణంలో వారంలో ఆరు రోజులు నిత్యం మాంసహార వ్యాపార కార్యకపాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ మటన్ మార్కెట్ సముదాయలలోకి వెళ్లాలంటే కొనుగోలుదారులు పరిసరాలలో వెళ్లె దుర్వాసన వల్ల ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి. దోమలు,మరోవైపు పందుల బెడద తో అవి సృష్టి అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. మాంసం కొనుగోలు చేసే ప్రజలు
కుటుంబ సభ్యులు సామూహికంగా వారంకోసారి సంతోషకరంగా వంట మార్పు చేసుకొని సంతోషంగా గడుపుతుంటారు. అయితే కంటికి కనిపించని మరో విధంగా మాంసాహార ప్రియులు మరో విధంగా వ్యాధులను కొనుగోలు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. వ్యాపార నిర్వాహకులకు భవనాల్లో సరైన వసతులు లేక విచ్చలవిడిగా మాంసాహారాన్ని ఎచ్చటపడితే అక్కడ వేస్తూ కొనుగోలుదారులకు విక్రయిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ లో జంతువు వధ శాల వేలంపాటలు నిర్వహించి ఆదాయాన్ని లక్షల్లో సమకూర్చుకున్న కనీసం ప్రజల భుజించే మాంసాహారపు సముదాయల పట్ల మెరుగైన వసతులు కల్పించడంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. త్రాగేనీరు బాగుండాలి అని నీతి సూక్తులు చెప్పే అధికారులే మాంసాహారపు విక్రయాలు జరిగే సముదాయల పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి అన్న ఆలోచన కూడా వారికి బుర్రకేక్కడం లేదు. కనీసం పారిశుద్ధ్య పనులు మున్సిపాలిటీ వారు చేపట్టడం లేదని ఎన్నిసార్లు వినిపించినా పట్టించుకోవడం లేదు అంటూ కనీసం వసతులను మెరుగుపరచాలని కోరిన వారు పట్టించుకోవడం లేదంటూ వ్యాపార నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో పరిసర ప్రాంతాలు దుర్వాసన వెదజల్లుతున్నాయని దానికి తోడు పందులు బెడద మరింత విపరీతంగా ఉందని వారు వాపోయారు. ప్రజలు తీసుకున్న ఆహార సముదాయాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడమేమిటి అంటూ ప్రజల అధికార తీరును తప్ప పడుతున్నారు. ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో జంతువధ శాల సముదాయాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా భవనాలను మెరుగుపరచడం వ్యాపార నిర్వాహకులకు వసతులు కల్పించడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రజలు మరియు వ్యాపార నిర్వాహకులు కోరుకుంటున్నారు.

- Advertisement -

వసతులు మెరుగుపరచాలి :శాడియాల రియాజ్.

మటన్ మార్కెట్ భవనాలలో మెరుగైన వసతులు కల్పించాలని,వాటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేయించాలని కోరిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ వ్యాపార నిర్వహకుడు శాడియాల రియాజ్ వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి తగిన వసతులు ఏర్పాటు చేసి క్రమం తప్పకుండ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News