Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: వర్షం కోసం శ్రీశైలం పాతాళ గంగాజలంతో ప్రత్యేక పూజలు

Nandikotkuru: వర్షం కోసం శ్రీశైలం పాతాళ గంగాజలంతో ప్రత్యేక పూజలు

వర్షాల కోసం ప్రత్యేక పూజలు

సకాలంలో వర్షాలు కురువకపోవడంతో రైతన్నల తీవ్రంగా నష్టపోతున్నారని, నియోజవర్గానికి చెందిన కొంతమంది రైతులు శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్లి పాతాళ గంగాజలం తీసుకువచ్చి ఆ జలంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని శివునికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసినట్టు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. నందికొట్కూరు పట్టణంలోని కోటా వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో, రైతుల ఆధ్వర్యంలో శ్రీశైలం పాతాళ గంగాజలం అభిషేక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం నుండి రైతన్నలు తెచ్చిన పాతాళ గంగ జలముతో ప్రదక్షిణలు చేసి శివుని కి జలాభిషేకం చేశారు .

- Advertisement -

అనంతరం ఆయన శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి కేసుకి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవడంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చొరవ అభినందనీయం అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో వర్షం కురవాలని ప్రత్యేక పూజలు చేస్తామని, ఈ క్రమంలోనే నియోజవర్గంలో రైతన్నల సంక్షేమం కోసం సమృద్ధిగా వర్షాలు పడాలని ఆ పరమశివునికి ఆంజనేయ స్వాములకు రైతులతో కలిసి ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ ప్రత్యేక పూజలు సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త గుంజుపల్లి లక్ష్మిరెడ్డి, గోవిందరెడ్డి, ఉపేంద్ర రెడ్డి, చింత విజి, భాస్కర్ యాదవ్, మహేశ్వర్ రెడ్డి, ఎం కృష్ణారెడ్డి, బాలస్వామి, కురువ శ్రీను, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News