Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Nandikotkuru: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి

పట్టణంలోనే స్థానిక కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీస్ కమిటీ హాల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ ఇందిరా ప్రియదర్శిని హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ సివిల్ జడ్జి ఇంద్ర ప్రియదర్శిని మాట్లాడుతూ సమాజంలో మహిళల సాధికారత, మహిళల చట్టపరకారంగా కల్పించబడిన హక్కులు, బాధ్యతలను మహిళలకు వివరించారు.

- Advertisement -

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. సమాజంలో మహిళల పాత్ర తల్లిగాను, బిడ్డగాను, చెల్లిగాను ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉందన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అంటే ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ, విద్య ఉద్యోగ సామాజిక రంగాలలో రాణించాలని ఆమె మహిళలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, సోషల్ వర్కర్స్, మహిళా పోలీస్ సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News